News April 23, 2025
MDK: బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు

బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 130 కాలేజీలు బాలురకు 127 కాలేజీలు బాలికలకు ఉన్నాయి. మరిన్ని వివరాలకు https://mjpabcwreis.cgg.gov.in/ TSMJBCWEB/లేదా 040-23328266 నంబర్‌ను సంప్రదించగలరు.
Similar News
News September 4, 2025
గంజాయి కేసులో ముగ్గురికి జైలు: ఆసిఫాబాద్ ఎస్పీ

గంజాయి సాగు, సరఫరా కేసులో ముగ్గురికి ఆసిఫాబాద్ కోర్టు జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించిందని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. గంజాయి సాగు చేసిన ఒకరు, సరఫరా చేస్తున్న ఇద్దరిపై ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేష్ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు తీసుకున్నా, సరఫరా చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కేసులో కృషి చేసిన పోలీసులను ఆయన అభినందించారు.
News September 4, 2025
చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుపడ్డ నిందితుడికి తిరుపతి రెడ్ శాండిల్ స్పెషల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2018 జూన్ లో వెదురుకుప్పం మండలం పచ్చికాపలం- తిరుపతి రోడ్డులో వాహనాల తనిఖీ సమయంలో సత్యవేడు మండలానికి చెందిన మహేంద్ర పట్టుపడ్డాడు. నేరం రుజువు కావడంతో గురువారం శిక్ష విధించారు.
News September 4, 2025
జీఎస్టీ తగ్గింపుతో సామాన్యులకు ఎన్ని రూ.వేలు సేవ్ అంటే?

పండగల వేళ GST శ్లాబులను తగ్గిస్తూ సామాన్యులకు కేంద్రం పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ఆహార పదార్థాలు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇతరత్రా <<17605715>>వస్తువులపై<<>> GSTని తగ్గించడం బిగ్ రిలీఫ్ కలిగించింది. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు ఏటా రూ.45వేలు ఆదా అవుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రూ.12 లక్షల వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదన్న గత ప్రకటనతో పాటు జీఎస్టీ ఆదా కలిపి ఏటా రూ.1.25లక్షలు సేవ్ అవుతాయని అంచనా వేస్తున్నారు.