News April 23, 2025
HYD: నెహ్రూ జూలాజికల్ పార్కులో సమ్మర్ క్యాంప్

నెహ్రూ జూలాజికల్ పార్కులో హైదరాబాద్ జూ జూస్టాస్టిక్ సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నట్లు క్యూరేటర్ తెలిపారు. మే మొదటి వారంలో ప్రారంభమై జూన్ వరకు ఈ సమ్మర్ క్యాంపు ఉంటుందన్నారు. 5 నుంచి పదవ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చని చెప్పారు. ఒక్కరికి రూ.1000 ఫీజు ఉంటుందని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. క్యాంప్‌లో జూ టూర్, సరీసృపాల అవగాహన సెషన్, నైట్ హౌస్ సందర్శన, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు.
Similar News
News April 17, 2026
విజయవాడ: ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్

విజయవాడలో ‘లెమన్ ఎక్స్చేంజ్’ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి బుకీ చాంద్ బాషా, సబ్ బుకీ పోతిరెడ్డి లక్ష్మణ్ రెడ్డితో పాటు ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు తెలిపారు.
News April 17, 2026
ఆదోని మార్కెట్‌లో పత్తి ధర రూ.8,939

ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.8,939 పలికింది. వేరుశనగ రూ.7,729, ఆముదాలు రూ.6,076 ధరలు లభించాయి. సీసీఐ కేంద్రాలు మూతపడటంతో పత్తి మొత్తం యార్డుకు వస్తోంది. అయితే మార్కెట్ యార్డులో మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకే జాతీయ మార్కెట్ అని, కనీస సౌకర్యాలు లేవని వారు మండిపడుతున్నారు.