News April 23, 2025

నేడే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 23, 2025

కరోనాను జయించి.. IASగా సత్తా

image

తాజా UPSC ఫలితాల్లో నారాయణవనం మండల వాసి సురేశ్ 988 ర్యాంక్‌తో సత్తా చాటిన విషయం తెలిసిందే. 2021లో ఆయన కరోనా బారిన పడ్డారు. కోలుకునే క్రమంలో వినికిడి సమస్యను ఎదుర్కొన్నారు. అయినా పట్టు వదలని ఆయన ఏడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం అంటే ఇష్టం అన్న ఆయన.. సమాజానికి తన వంతు కృషి చేస్తానన్నారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాలు.. 81.14% ఉత్తీర్ణత

image

AP: పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది పాసైనట్లు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా (93.90%) తొలి స్థానంలో, అల్లూరి సీతారామరాజు జిల్లా (47.64%) చివరిస్థానంలో నిలిచాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు అత్యధిక ఉత్తీర్ణత శాతం (95.02%) సాధించాయి.

News April 23, 2025

BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్‌ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT

error: Content is protected !!