News April 23, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అనంతపురం జిల్లాలో 32,803 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
Similar News
News April 23, 2025
అనంతపురం జిల్లాలో ఉద్యోగాలు.!

అనంతపురం జిల్లా శింగనమల KGBVలో ఖాళీ పోస్టులకు ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. KGBVలోని టైప్-3 హస్టల్లో ఉన్న ఖాళీలను MEO నరసింహ రాజు వివరించారు. KGBV-3లో హెడ్ కుక్-1 పోస్ట్, అసిస్టెంట్ కుక్-3 పోస్టులు, వాచ్మెన్-1 ఖాళీగా ఉన్నాయి. అంతేకాకుండా టైప్-4లో చౌకీదార్-1, హెడ్ కుక్-1, అసిస్టెంట్ కుక్-1 ఖాళీగా ఉన్నాయి. ఈనెల 30లోగా మహిళలు ఈ పోస్టులకు శింగనమల MEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 23, 2025
అనంత: రైలు చైన్ లాగారంటే.. మెడలో చైన్ ఊడినట్లే.!

సురక్షిత ప్రయాణాలు చేయాలనుకునే వారు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అలాంటిది రైలు ప్రయాణాలంటే బయపడాల్సిన పరిస్థితి వచ్చింది. రైలు నిర్మానుష్య ప్రాంతంలో ఆగిందంటే మహిళల మెడల్లో చైన్ చోరీ జరిగినట్లే. ఇటీవల గుంతకల్లు- తిరుపతి రూట్ ఔటర్లో నిలిచిన ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో, శ్రీ సత్యసాయి జిల్లాలోనూ 2 వరుస చోరీలు జరిగాయి. అధికారులు ఇలాంటి చర్యలపై నిఘా పెట్టాలని రైల్వే ప్రయాణికులు కోరుతున్నారు.
News April 23, 2025
రైతు బిడ్డకు 465 మార్కులు

గుత్తి మండల పరిధిలోని కొత్తపేట గ్రామానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ, రజిని దంపతుల కుమారుడు రేశ్వంత్ తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదివిన యువకుడు ఎంపీసీలో 470కు గానూ 465 మార్కులు సాధించారు. యువకుడిని రైతులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు అభినందించారు.