News April 23, 2025

ఏప్రిల్ 23: చరిత్రలో ఈరోజు

image

✒ 1616: ప్రఖ్యాత నాటక రచయిత షేక్‌స్పియర్ మరణం
✒ 1791: అమెరికా మాజీ అధ్యక్షుడు బుకానన్ జననం
✒ 1891: రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి జననం
✒ 1938: ప్రముఖ సింగర్ ఎస్.జానకి జననం
✒ 1969: నటుడు మనోజ్ బాజ్‌పాయ్ జననం
✒ 1992: సినీ దర్శకుడు సత్యజిత్ రే మరణం
✒ 2020: ప్రముఖ రంగస్థల నటి ఉషా గంగూలీ మరణం
✒ ఇవాళ ప్రపంచ పుస్తక దినోత్సవం
✒ నేడు ప్రపంచ ఆంగ్ల భాష దినోత్సవం

Similar News

News April 23, 2025

BRS పేరు మారుస్తారా? KTR ఏమన్నారంటే?

image

TG: BRS పేరు మార్చాల్సిన అవసరం లేదని, తీరు మార్చుకోవాలని KTR ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. KCR లెజెండ్, కారణజన్ముడు అని పేర్కొన్నారు. KCR కాకుండా తనకు నచ్చిన CM పినరయి విజయన్(కేరళ) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, పవన్ కళ్యాణ్ తాను ఊహించిన దానికంటే ఉన్నత స్థాయికి ఎదిగారని అన్నారు. మోదీ మతపరమైన అజెండాను ప్రచారం చేస్తున్నారని, ఇప్పటివరకు PMగా చేసిందేం లేదని అభిప్రాయపడ్డారు.

News April 23, 2025

టెన్త్‌లో RECORD: 600కు 600 మార్కులు

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించింది. పదో తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
*Congratulations Nehanjani Yalla

News April 23, 2025

టెస్లాకే టైం కేటాయిస్తా: మస్క్

image

మే నెల నుంచి టెస్లా వ్యవహారాలకే అధిక సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించారు. DOGE కోసం ఎక్కువ సమయం పనిచేయనని తెలిపారు. టెస్లా త్రైమాసిక లాభాలు 71శాతం మేర క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. DOGEకు అధినేతగా వ్యహరిస్తున్న మస్క్ నిర్ణయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు తొలగించారు. దీంతో మస్క్‌పై వ్యతిరేకత అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!