News April 23, 2025

HYDలో నేడు ఎన్నికలు.. BJP VS MIM

image

GHMC హెడ్ ఆఫీస్‌లో నేడు స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. MIM నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, BJP నుంచి గౌతంరావు బరిలో ఉన్నారు. 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫిషియోలతో కలిపి మొత్తం 112 మంది ఓటర్లు ఉన్నారు. MIMకు 50 ఓట్లు, BRSకు 24, BJPకి 24, INCకు 14 ఓట్లు ఉన్నాయి. 22 ఏళ్ల తర్వాత ఈ ఎన్నిక జరగడం, INC, BRS పోటీ చేయకపోవడంతో గ్రేటర్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. APR 25న లెక్కింపు జరగనుంది.

Similar News

News July 7, 2025

HYD: కాలుకు సర్జరీ.. గుండెపోటుతో బాలుడి మృతి

image

కాలుకు సర్జరీ చేసిన అనంతరం గుండెపోటు రావడంతో 7 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన HYDలో వెలుగుచూసింది. కాలులో చీమును తొలగించేందుకు బాలుడిని తల్లిదండ్రులు బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లోని టీఎక్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఈ సమయంలో గుండెపోటు రావడంతో బాలుడు మరణించాడు. వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడి ప్రాణాలు పోయాయని తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.

News July 7, 2025

HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

image

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.

News July 7, 2025

HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

image

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.