News April 23, 2025

జనగామ: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ పాలకవర్గ సమావేశం

image

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఎజెండాగా పెట్టి జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అదేవిధంగా రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పాలక మండలి సభ్యులకు సూచించారు.

Similar News

News April 19, 2026

HYD: మహిళలకు ఫ్రీ బ్యూటీషియన్ శిక్షణ

image

మొయినాబాద్‌లోని చిల్కూరులో SBI- RSETI ఆధ్వర్యంలో మహిళలకు ఈ నెల 24 నుంచి ఉచిత బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ మహ్మద్ అలీ తెలిపారు. 18- 45 ఏళ్ల మధ్య వయసు గల యువతులు, మహిళలు అర్హులు. ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డ్, 10th మెమోతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కాలంలో ఉచితంగా భోజన, వసతి సౌకర్యాలు ఉంటాయన్నారు. మరిన్ని వివరాలకు 79819 51167 నంబరును సంప్రదించగలరు.

News April 19, 2026

ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

image

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.

News April 19, 2026

నల్గొండ: వివాహిత అనుమానాస్పద మృతి

image

నల్గొండ మండలం పానగల్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మాందాపురానికి చెందిన ఐశ్వర్య(19)కు, పానగల్‌కు చెందిన శివతో 6 నెలల క్రితమే వివాహమైంది. శనివారం ఆమె ఇంట్లో ఉరివేసుకుని విగతజీవిగా పడి ఉంది. అయితే, ఐశ్వర్యను ఆమె మామయ్యే హత్య చేసి ఉంటాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయిన కొద్ది కాలానికే కుమార్తె మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.