News April 23, 2025
వాల్టా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

భూగర్భ వనరులను కాపాడుతూ.. నీటిని సంరక్షించేందుకు ప్రభుత్వం రూపొందించిన వాల్టా చట్టంని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణపై భూగర్భ జలాల పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జనగామ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, భూగర్భ జలాలను కాపాడుతూ వాటిని పెంపొందించాలన్నారు.
Similar News
News April 23, 2025
HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.
News April 23, 2025
మునగపాక: పెళ్లైన రెండు నెలలకే నవవధువు ఆత్మహత్య

ఓ నవవధువు పెళ్లైన రెండు నెలలకే ఆత్మహత్య చేసుకుంది. మునగపాక బీసీ కాలనీలో శ్రీనివాసరావు, నాగమణి దంపతులు ఉంటున్నారు. వీరి కుమార్తె శరణ్యకు నాగమణి తమ్ముడితో ఈ ఏడాది ఫిబ్రవరి 20న వివాహం జరిగింది. ఆమె కొంతకాలంగా గైనిక్ సమస్యతో బాధపడుతోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
News April 23, 2025
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.