News April 23, 2025

నిర్మల్: ఇంటర్ ఫలితాల్లో మారిన జిల్లాస్థానం

image

ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా ఉత్తీర్ణత స్థానంలో మార్పు సాధించింది. గతేడాది ఫస్టియర్‌లో నిర్మల్ జిల్లా 56% ఉత్తీర్ణతతో 16వ స్థానంలో నిలువగా ఈసారి 70.87%తో 17వ స్థానానికి చేరింది. సెకండియర్‌లో గతేడాది 66% ఉత్తీర్ణతతో 12వ స్థానంలో ఉండగా.. ఈసారి 58.78% ఉత్తీర్ణతతో పదో స్థానం కైవసం చేసుకుంది.

Similar News

News April 23, 2025

వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

image

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.

News April 23, 2025

సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.

News April 23, 2025

KMR: వేసవి సెలవులు.. ఇంటి బాట పట్టిన విద్యార్థులు

image

పాఠశాలలు ముగియడం.. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థుల్లో సందడి నెలకొంది. వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల ఒత్తిడికి కాస్త విరామం దొరకడంతో సొంతూళ్లకు చేరుకుంటున్న విద్యార్థులతో పిట్లంలో సందడి వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది.

error: Content is protected !!