News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
Similar News
News April 23, 2025
తల్లిదండ్రులూ.. పిల్లల కంటే మార్కులు ఎక్కువ కాదు!

టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనో, తక్కువ మార్కులొచ్చాయనో విద్యార్థులు సూసైడ్ చేసుకొని జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. ఈ సమయంలో ఫెయిలైన పిల్లల తల్లిదండ్రులు వారిని దగ్గరికి తీసుకొని, ఫెయిల్ అయినంత మాత్రాన అంతా అయిపోదనే భరోసా కల్పించండి. తక్కువ మార్కులొస్తే మరొకరితో పోల్చి సూటిపోటి మాటలు అని చిన్ని హృదయాలకు భారం అవ్వొద్దు. ఈ వయసులో వారు తట్టుకోలేక కఠిన నిర్ణయాలు తీసుకొనే ప్రమాదం ఉంది.
News April 23, 2025
పాకిస్థాన్‌కు భారత్ దెబ్బ?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మిలిటరీ, దౌత్యపరంగా పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
*పాక్ ఆర్మీ, లష్కరే తోయిబా స్థావరాలపై దాడి
*ఆ దేశంతో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం
*సింధు నదీజలాల ఒప్పందం రద్దు
*ఈ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్ర గురించి భారత్ UN సెక్యూరిటీ ప్రతినిధులకు, 95 దేశాలకు వివరించి దోషిగా నిలబెట్టే యోచన.
News April 23, 2025
కొత్త పెన్షన్లు.. అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆదేశం

TG: రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను రెడీ చేయాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. వీటిపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేటగిరీల కింద దాదాపు 43 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి. దివ్యాంగులకు రూ.4,016, ఇతరులకు రూ.2,016 ఇస్తున్నారు.