News April 23, 2025
ఇంటర్ ఫలితాల్లో చివరన నిలిచిన మహబూబాబాద్ జిల్లా

మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా ఉత్తీర్ణత శాతంలో చాలా వెనుకబడింది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 48.43 శాతం ఫలితాలు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా 33వ స్థానం సాధించి చివరి స్థానంలో నిలిచింది. రెండో సంవత్సరం ఫలితాల్లో 63.68 శాతం ఫలితాలు సాధించి 29వ స్థానంలో నిలిచింది. జిల్లాలో విద్యారంగంపై అధికారులకు శ్రద్ధ లేకపోవడం వల్లే చివరణ నిలిచిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Similar News
News April 20, 2026
చిత్తూరు: బాబోయ్ ఎండలు..!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. కూలీల పరిస్థితి వర్ణనాతీతం. ఆదివారం అత్యధికంగా తవణంపల్లెలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శ్రీరంగరాజపురంలో 41.4, గంగవరంలో 41.4, రొంపిచెర్లలో 41.0, పెద్దపంజాణి, బంగారుపాళ్యంలో 40.8, నిండ్రలో 40.6, నగరిలో 40.4, శాంతిపురంలో 39.9, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్, గుడిపాల, పూతలపట్టులో 39.8 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది.
News April 20, 2026
ఉ.9.30 నుంచే PGRS: నంద్యాల కలెక్టర్

వేసవి దృష్ట్యా సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సమయాన్ని మార్చినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. జిల్లాలో ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోనూ సమర్పించవచ్చని పేర్కొన్నారు.
News April 20, 2026
సంగారెడ్డి: నేటి నుంచి సంక్షేమ వారోత్సవాలు

సంగారెడ్డి జిల్లాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, వంటగది పరిశుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులకు చిత్రలేఖనం, పెయింటింగ్, ఉపన్యాసం, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు.


