News April 23, 2025
విశాఖ పోలీసులను అభినందించిన నేపాల్ పోలీసులు

నేపాల్‌కు చెందిన ఓ మహిళ తప్పిపోయి విశాఖలో ఉన్నట్లు నేపాల్ పోలీసులు గమనించారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు విశాఖ సీపీ చొరవతో గాజువాక పోలీసుల సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ విషయమై మంగళవారం నేపాల్ పోలీసులు విశాఖ సీపీ, పోలీసులను అభినందిస్తూ లేఖ రాశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన గాజువాక పోలీసులను సీపీ అభినందించారు.
Similar News
News April 23, 2025
సింహాద్రి అప్పన్న హుండీ ఆదాయం లెక్కింపు

సింహాద్రి అప్పన్నకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు 28 రోజులకు గాను ఆలయ అధికారులు ఈవో సుబ్బారావు పర్యవేక్షణలో బుధవారం లెక్కించారు. మొత్తం రూ.1,81,41,219 ఆదాయం వచ్చింది. బంగారం 145.100 గ్రాములు, వెండి 11.250 కిలోలు, 8 దేశాల విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
News April 23, 2025
విశాఖ: 600కి 598 మార్కులు

పెందుర్తిలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన అబ్దుల్ సమీరా భాను బుధవారం విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాలల్లో సత్తా చాటింది. 600 మార్కులకు గాను 598 మార్కులు వచ్చాయి. పెందుర్తి మండలంలో 598 మార్కులు రావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థిని పలువురు అభినందించారు.
News April 23, 2025
నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్నారు. సాయంత్రం గన్నవరం నుంచి విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖకు చెందిన చంద్రమౌలికి నివాళులు అర్పిస్తారు. భౌతికకాయం రాత్రి 10గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. చంద్రబాబు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వయంగా స్వీకరించి, నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చుతారు.