News April 23, 2025

సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన ADB బిడ్డ

image

UPSC సివిల్స్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు ఆదా సందీప్ సత్తా చాటాడు. ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటేష్-వాణి దంపతుల చిన్న కుమారుడు సందీప్ సివిల్స్ ఫలితాల్లో 667 ర్యాంక్ సాధించాడు. గతంలో తొలి ప్రయత్నంలో 830 ర్యాంక్ సాధించాడు. అదే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి ఇప్పుడు 667 ర్యాంక్ సాధించడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సందీప్‌ను అభినందించారు.

Similar News

News March 4, 2026

ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షలు.. 376 మంది గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 8,529 మంది విద్యార్థులకు గాను 8,153 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 282 మంది, ఒకేషనల్ విభాగంలో 94 మంది కలిపి మొత్తం 376 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News March 4, 2026

ఉట్నూర్: జీసీసీకి నిధులు మంజూరయ్యేనా..?

image

ఉమ్మడి ADBలోని 41 కొత్త డీఆర్ డిపోల నిర్మాణానికి రూ.8.20 కోట్లు, 21 డీఆర్ డిపోల మరమ్మతులకు రూ.కోటి, డివిజన్ ఆఫీస్‌ల మరమ్మతులకు రూ.10 లక్షలు, కాగజ్‌నగర్, జన్నారం ఆసిఫాబాద్‌లో ఆఫీస్‌ల నిర్మాణానికి రూ.1.50 కోట్లు, అటవీ ఉత్పత్తుల సేకరణకు రూ.2.10 కోట్లు నిధులు అవసరం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గీక్ ఛైర్మన్ తిరుపతికి ఇటీవల కలిసి జీసీసీ డీఎం సందీప్ కుమార్ విన్నవించారు. మరి నిధులు మంజూరయ్యేనా చూడాలి.

News March 3, 2026

హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

హోలీని శాంతియుతంగా, స్వీయ భద్రతా జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. యువత, చిన్నారులు ఉత్సాహంలో వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.