News April 23, 2025

HYD: గురుకుల విద్యార్థికి స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్

image

మైనార్టీ గురుకులానికి చెందిన ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థి ఎండీ. ఫర్హాన్‌కు CEC విభాగంలో స్టేట్ ఫ‌స్ట్ ర్యాంక్ ల‌భించింది. TMRJC ఖైర‌తాబాద్‌కు చెందిన ఫర్హాన్‌కు 500 మార్కుల‌కు గాను 495 మార్కులు వ‌చ్చాయి. ప్రణాళిక ప్రకారం చదవడం, అధ్యాపకుల ప్రోత్సాహం కారణంగా ఈ ర్యాంక్ వచ్చినట్టు ఫర్హాన్ తెలిపారు. దీంతో విద్యార్థికి కళాశాల అధ్యాపకులు, తోటి మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News September 4, 2025

వ్యవసాయ వర్సిటీకి 24వ ర్యాంక్

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఐఆర్‌ఎఫ్- 2025 ర్యాంకింగ్స్‌లో దేశంలోనే 24వ స్థానంలో నిలిచింది. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ నివేదికలో వ్యవసాయ, అనుబంధ విశ్వవిద్యాలయాల పనితీరును పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్దాస్ జానయ్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ ర్యాంక్ సాధించడం తమ కృషికి నిదర్శనమని తెలిపారు.

News September 3, 2025

జూబ్లీహిల్స్ ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్

image

జూబ్లీహిల్స్ ఓటరు ముసాయిదా జాబితాను జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ విడుదల చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 3,92,669 మంది ఓటర్లు ఉండగా వారిలో.. పురుషులు 2,04,228, మహిళలు 1,88,356, ఇతరులు 25 ఉన్నారన్నారు. సెప్టెంబర్ 17 వరకు అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందని, సెప్టెంబర్ 30న జాబితా విడుదల చేస్తామని స్పష్టంచేశారు.

News September 2, 2025

లండన్‌లో యాక్సిడెంట్.. HYD వాసులు మృతి

image

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో HYDకు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 2 కార్లు ఎదురెదురుగా ఢీకొనగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను నాదరుల్ చెందిన తర్రె చైతన్య (22), ఉప్పల్‌కు చెందిన రిషితేజ (21)గా పోలీసులు గుర్తించారు. గణేశ్ నిమజ్జనం చేసి వస్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.