News April 23, 2025
ఖమ్మం: సివిల్స్‌లో 231వ ర్యాంకు సాధించిన చరణ్ తేజ

ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరం గ్రామానికి చెందిన నర్సింశెట్టి చరణ్ తేజ దేశవ్యాప్తంగా విడుదలైన సివిల్స్ పరీక్షలో 231వ ర్యాంకు సాధించారు. కాగా చరణ్ తల్లి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తుండగా.. తండ్రి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చరణ్ తేజ సాధించిన విజయం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
Similar News
News April 18, 2026
ఆత్రేయపురం: గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి

ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో శనివారం ఉపాధి హామీ పనిలో మెర్ల సత్యనారాయణ అనే వేతనదారుడు గుండెపోటుతో మృతి చెందారు. పని చేస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను స్థానికులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
News April 18, 2026
GNT: ఎండలు బాబోయ్.. ఉక్కబోతతో జనం ఉక్కిరి బిక్కిరి

గుంటూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకీ సూర్యప్రతాపం పెరిగిపోతూ రికార్డు స్ధాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. శనివారం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల ధాటికి ప్రజలు ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటకు రావడానికే భయపడి పోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రాత్రి వేళల్లోనూ కొనసాగుతున్నాయి.
News April 18, 2026
బీజేపీ నుంచే అత్యల్పంగా మహిళా ఎంపీలు: మహువా

మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లు వీగిపోవడంతో విపక్షాలపై PM మోదీ సహా BJP నేతలు చేస్తున్న విమర్శలకు TMC MP మహువా మొయిత్రా Xలో కౌంటరిచ్చారు. లోక్‌సభలో BJP నుంచే అత్యల్పంగా మహిళా MPలు(240 మందిలో 31 మంది.. 12.90%) ఉన్నారని గుర్తు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచిన 29 మంది MPల్లో 11 మంది మహిళలు(37.90%) అని పేర్కొన్నారు. ఇప్పుడున్న 543 సీట్లకు ఉమెన్ రిజర్వేషన్ అమలు చేయకుండా ఎవరు ఆపుతున్నారని ప్రశ్నించారు.


