News April 23, 2025
జమ్ములో ఉగ్ర దాడి.. తీవ్రంగా ఖండించిన ఎంపీ

జమ్ము కశ్మీర్‌లో మంగళవారం టూరిస్ట్‌లపై ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులపై కాల్పులు జరపడం తనను కలిచి వేసిందన్న ఆయన.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు. దేశ సరిహద్దులో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉగ్రవాదులకు గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Similar News
News December 26, 2025
నెల్లూరులో ఆయనో డిఫరెంట్ MLA..?

నెల్లూరు జిల్లాలో తొలిసారి గెలిచిన ఓ MLA తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉంటున్న వారిని సైతం దూరం పెట్టేస్తున్నారంట. తాను తప్ప నియోజకవర్గంలో ఎవరూ పెత్తనం చలాయించడానికి లేదని ముఖాన చెప్పేస్తున్నారంట. తనకు గిట్టని వాళ్లను హైలెట్ చేసేలా సొంత పార్టీ నాయకులు ఫ్లెక్సీలు వేసినా ఊరుకోవడం లేదంట. దగ్గరుండి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన నేతకు సైతం ఆయన శత్రువుగా మారారట.
News December 26, 2025
నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎంని కోరా: ఆనం

రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్‌కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి నేటితో ఆఖరి రోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నెల్లూరులో మంత్రి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
News December 26, 2025
నెల్లూరు: 104 వాహనాల్లో ఉద్యోగావకాశాలు

జిల్లాలోని 104 వాహనాల్లో డ్రైవర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. డీఈవోలకు డిగ్రీ, కంప్యూటర్ కోర్సు, డ్రైవర్లకు టెన్త్ పాస్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అవసరమని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు bhspl.in/careers ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. తిరుపతి రుయా ఆసుపత్రిలోని TB జిల్లా కార్యాలయంలో ఈనెల 27, 28 తేదీలలో సంప్రదించాలని కోరారు.


