News April 23, 2025

VJA: యువతిని బెదిరించి బంగారంతో జంప్

image

యువతిని నమ్మించి వంచన చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసుల వివరాలు ప్రకారం.. విజయవాడకు చెందిన యువతికి (25) ఓ డేటింగ్ యాప్‌లో అపరిచిత వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరూ మంగళవారం కలుసుకున్నారు. యువతిని హోటల్ రూమ్‌కు తీసుకువెళ్లిన సదరు వ్యక్తి కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఉంగరాలు, సెల్ ఫోన్ తీసుకొని ఉడాయించాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 23, 2025

ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

image

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

News April 23, 2025

చొప్పదండి: మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: కలెక్టర్

image

ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో టెస్టులు చేయించుకోవాలని.. తద్వారా రుగ్మతలు నివారించుకోవచ్చన్నారు.

News April 23, 2025

HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

image

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.

error: Content is protected !!