News April 23, 2025
పహల్‌గామ్‌లో అనుమానాస్పద బైక్ గుర్తింపు

జమ్మూకశ్మీర్ పహల్‌గామ్ ఉగ్రదాడి ఘటన విచారణలో భద్రతా బలగాలు పురోగతి సాధించాయి. పహల్‌గామ్ సమీపంలో నంబర్ ప్లేట్ లేని బైక్‌ను గుర్తించాయి. టెర్రరిస్టులు దీన్ని ఉపయోగించినట్లు అనుమానిస్తున్నాయి. బైక్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నాయి. మరోవైపు ఘటనా స్థలానికి ఇవాళ ఎన్ఐఏ బృందాలు చేరుకోనున్నాయి.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
News April 23, 2025
సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.