News April 23, 2025
ఇంటర్‌లో ఫెయిల్.. సివిల్స్‌లో ర్యాంకర్

UPSC తుది ఫలితాల్లో తిరుపతి జిల్లా వాసి సత్తా చాటాడు. నారాయణవనం(M) గోవిందప్ప కండ్రిగ వాసి సురేశ్ సివిల్స్‌లో 988 ర్యాంకుతో అదరగొట్టారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన ఆయన.. సివిల్స్‌లో సత్తా చాటడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు. 2017 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయన తాజాగా అనుకున్నది సాధించారు.
Similar News
News April 23, 2025
ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
News April 23, 2025
చొప్పదండి: మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: కలెక్టర్

ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుందని, స్త్రీలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. చొప్పదండిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పోషణ పక్షం కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని, గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలని కోరారు. ఆరోగ్య మహిళా కార్యక్రమంలో టెస్టులు చేయించుకోవాలని.. తద్వారా రుగ్మతలు నివారించుకోవచ్చన్నారు.
News April 23, 2025
HYD: సంగారెడ్డి జైలుకు అఘోరి

లేడీ అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి PSకు తరలించి, 2 గంటల పాటు విచారించిన అనంతరం చేవెళ్ల ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చారు. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అఘోరి చెప్పడంతో లీగల్ ఎయిడ్ సర్వీసెస్ న్యాయవాది కుమార్‌ను జడ్జి నియమించారు. వాదనలు విన్న జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అఘోరిని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.