News March 28, 2024

మధిర: ట్రాక్టర్ రోటవేటర్‌లో చెత్త తొలగిస్తుండగా రైతు మృతి

image

మధిర మండలం నిదానపురానికి చెందిన నర్సిరెడ్డి అనే రైతు తన వ్యవసాయ పొలంలో మిర్చి పంటను సాగు చేశాడు. మిర్చి పంట పూర్తి కాగా వ్యర్థాలను తొలగించడానికి రైతు ట్రాక్టర్ రోటవేటర్‌తో దున్నుతున్నాడు. రోటవేటర్‌లో చెత్త ఇరుక్కుపోయి ఆగిపోవడంతో చెత్తను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు రోటవేటర్‌లో పడిపోయాడు. తల నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

Similar News

News March 25, 2026

ఖమ్మంలో 28న జాతీయ లోక్ అదాలత్

image

ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న(శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఖమ్మంలోని న్యాయ సేవా సదన్ భవనంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులను ఈ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

News March 25, 2026

పరిమితి దాటిన వైద్యం.. ప్రాణాల మీదకు తెస్తున్న ఆర్ఎంపీలు!

image

ఖమ్మం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల ‘అవతారం’ రోగుల పాలిట శాపంగా మారుతోంది. ప్రథమ చికిత్సకే పరిమితం కావాల్సిన వీరు, నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారుల అలసత్వంతో రోగులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. తనిఖీలు చేపట్టి, నకిలీ క్లినిక్‌లపై ఉక్కుపాదం మోపాలని జిల్లావాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.