News April 23, 2025
BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా మేదరి ఆంజనేయులు

వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణ వాసి మేదరి ఆంజనేయులుని BCF వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగనమోని చెన్న రాములు ముదిరాజ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో BCF రాష్ట్ర కార్యదర్శి రామన్ గౌడ్, SCF రాష్ట్ర కార్యదర్శి బహుజన రమేశ్, మహాజన రైతు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంధ్యపాగ వెంకటేశ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లెమోని మన్యం, శివకుమార్ పాల్గొన్నారు.
Similar News
News April 23, 2025
సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
News April 23, 2025
వీరయ్య చౌదరి ఒంటిపై 53 కత్తిపోట్లు: CM

వీరయ్య చౌదరి లాంటి నేతను కోల్పోవడం చాలా బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. అమ్మనబ్రోలులో ఆయన మాట్లాడుతూ.. ‘నారా లోకేశ్, అమరావతి రైతుల పాదయాత్రలో వీరయ్య కీలకంగా ఉన్నారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. వీరయ్య ఒంటిపై 53 కత్తిపోట్లు ఉన్నాయి. ఈ ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టను. ఎక్కడ దాక్కున్నా లాక్కొని వస్తా’ అని సీఎం హెచ్చరించారు.
News April 23, 2025
సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.