News April 23, 2025

నేడు HYDకు సీఎం రేవంత్

image

TG: జపాన్‌లో సీఎం రేవంత్ పర్యటన ముగిసింది. ఇవాళ ఆయన తన బృందంతో కలిసి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈనెల 15న ఆయన జపాన్‌కు వెళ్లారు. ఈ పర్యటనలో సుమారు రూ.12వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 30,500 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. HYDలో ఎకో టౌన్ అభివృద్ధికి జపాన్‌తో డీల్ కుదుర్చుకున్న సీఎం, మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం ఆ దేశంలోని రివర్ ఫ్రంట్‌లను పరిశీలించారు.

Similar News

News April 23, 2025

ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాలిబన్లు

image

J&K ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ‘జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాం. ఇలాంటి ఘటనలు దేశభద్రతను దెబ్బతీస్తాయి’ అని తాలిబన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అటు ఈ ఉగ్రదాడులపై బంగ్లాదేశ్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.

News April 23, 2025

సిద్దరామయ్య, డీకేకు హత్య బెదిరింపులు

image

కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వారిని హత్య చేస్తామని బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. వారిద్దరి డెడ్‌బాడీలను ముక్కలుముక్కలుగా నరికి బ్యాగులో కుక్కుతానని బెదిరించారు. ఈ మెయిల్స్ సింధార్ రాజ్‌పుత్ పేరిట వచ్చినట్లు విధానసౌధ పీఎస్ పోలీసులు గుర్తించారు. పోలీసులు FIR నమోదు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.

News April 23, 2025

సెల్యూట్: ఉగ్రవాదులతో పోరాడి.. వీర మరణం

image

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారిలో సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఒక్కడే స్థానికుడు. గుర్రంపై పర్యాటకులను ఎక్కించుకుని పహల్‌గామ్ తీసుకెళ్తూ ఉంటాడు. అందరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే.. హుస్సేన్ మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా ఎదురు తిరిగాడు. ఓ ఉగ్రవాది నుంచి రైఫిల్ లాక్కునేందుకు ప్రయత్నించగా కాల్చి చంపేశారు. తమ బిడ్డ మరణానికి దేశం ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరెంట్స్ కోరుతున్నారు.

error: Content is protected !!