News April 23, 2025

ఆదోని మార్కెట్‌లో మళ్లీ పెరిగిన పత్తి ధరలు.!

image

కర్నూలు జిల్లాలో ఆదోని మార్కెట్‌లో పత్తి ధర నిన్నటితో పోలీస్తే క్వింటాకు రూ.150 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో మంగళవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,254 గా ఉంది. కనిష్ఠ ధర రూ.5,209 ఉండగా, మధ్యస్థ ధర రూ.7,639కి పెరిగింది.

Similar News

News April 23, 2025

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

News April 23, 2025

యలమంచిలి విద్యార్థినికి 599/600 మార్కులు

image

యలమంచిలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిన వై.అనీషా బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటింది. మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. తండ్రి అచుతాపురం బ్రాండిగ్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 599 మార్కులు సాధించిన అనీషాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు, తోటి విద్యార్థులు అభినందించారు.

News April 23, 2025

మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

image

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.

error: Content is protected !!