News April 23, 2025
ఖేడ్: చికిత్స పొందుతూ రేషన్ డీలర్ మృతి

కంగ్టి మండల ఎన్కేమూరికి చెందిన రేషన్ డీలర్ మేత్రి.యేషప్ప గత కొన్ని సంవత్సరాలుగా రేషన్ డీలర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆకస్మికంగా మరణించారు. మృతుడికి భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మండల రేషన్ డీలర్లు కోరారు.
Similar News
News April 17, 2026
ఉత్తర, దక్షిణాది మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారు: కిషన్ రెడ్డి

డీలిమిటేషన్‌పై ఉత్తరాది, దక్షిణాది మధ్య గొడవలు సృష్టించాలని విపక్షాలు చూస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో విమర్శించారు. 2 ప్రాంతాల మధ్య యుద్ధం వస్తుందంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని మోదీ స్పష్టం చేశారని గుర్తు చేశారు. మరోవైపు పార్లమెంటులో నిన్న BJP MP తేజస్వీ సూర్య TG ప్రజలను అవమానించేలా మాట్లాడలేదని తెలిపారు.
News April 17, 2026
GNT: అమరావతి ఐకానిక్ భవనాల పనుల అప్‌డేట్

రాజధాని అమరావతిలో సచివాలయం, హెచ్‌ఓడీ టవర్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లలో 1 నుంచి 4 వరకు జీ+39 అంతస్తులతో నిర్మించనుండగా, ఐదో టవర్‌ను అత్యంత ఎత్తుగా జీ+49 అంతస్తులతో రూపొందిస్తున్నారు. 2028 డిసెంబర్ నాటికి ఈ భారీ నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని సిగలో మణిహారాలుగా నిలిచే ఈ భవనాలు పాలనకు గుండెకాయలా మారనున్నాయి.