News April 23, 2025

పహల్గామ్‌లో ఉగ్రదాడి.. MLC కవిత దిగ్భ్రాంతి

image

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై MLC కవిత తీవ్ర దిగ్భ్రాంతికి చెందారు. అమాయక పర్యాటకులపై జరిగిన క్రూరమైన దాడితో తీవ్ర భయాందోళనకు గురయ్యారన్నారు. ఈ దుర్ఘటనలో బాధితుల కోసం తమ హృదయాలు విలపిస్తున్నాయన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కవిత ‘X’లో పోస్ట్‌ చేశారు.

Similar News

News April 18, 2026

భాగ్యనగరానికి తలమానికం.. మన చార్మినార్

image

450 సంవత్సరాల క్రితం నిర్మితమైన సుందరమైన కట్టడం చార్మినార్. భాగ్యనగరానికి ఇది అమూల్యమైన వారసత్వ సంపద. ఈ కట్టడం నాలుగు శతాబ్దాలుగా ఇండో- ఇస్లామిక్ శిల్పకళా వైభవానికి, మతసామరస్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మన సంస్కృతికి ప్రత్యేకగా నిలిచిన ఈ చారిత్రక వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మన వారసత్వ సంపదను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. # నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం.

News April 18, 2026

BHPL: కోఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహుల ఎదురుచూపు!

image

గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికపై ఆశావహులు ఎదురు చూస్తున్నారు. సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నెల రోజుల్లో కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు. కానీ ఎన్నికలు ముగిసి 3 నెలలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం లేదని గ్రామాల్లో చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

News April 18, 2026

గుంటూరులో NHM పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి!

image

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో 7 ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు www.guntur.nic.in లో దరఖాస్తులు పొందవచ్చని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.800, ఇతరులు రూ.500 ఫీజు బ్యాంకులో చెల్లించాలి. నింపిన దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 30 లోగా నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలి.