News April 23, 2025
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ అరెస్ట్: ADB SP

పాఠశాల విద్యార్థినులు, మహిళా టీచర్‌ను వేధించిన పీఈటీ టీచర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మావల జడ్పీహెచ్ఎస్‌లో పీఈటీ గుండి మహేశ్ విద్యార్థినులు, మహిళా టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుసుకొని, షీ టీంకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మావల పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదు చేశారు. మంగళవారం పీఈటీని అరెస్ట్ చేశారు.
Similar News
News April 23, 2025
అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News April 23, 2025
యలమంచిలి విద్యార్థినికి 599/600 మార్కులు

యలమంచిలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిన వై.అనీషా బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సత్తాచాటింది. మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించింది. తండ్రి అచుతాపురం బ్రాండిగ్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. 599 మార్కులు సాధించిన అనీషాను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు, తోటి విద్యార్థులు అభినందించారు.
News April 23, 2025
మోదీ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభం

పహల్‌గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. దీనికి కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జైశంకర్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించనున్నారు.