News April 23, 2025
ఏలూరు: విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

సోషల్ మీడియాకు, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. ఏలూరులో కలెక్టర్ మాట్లాడుతూ.. చదువులపై శ్రద్ధ పెట్టి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునే దిశగా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులకు తల్లి, తండ్రి, దైవం అన్ని చదువు చెప్పే గురువేనన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని అధ్యాపకులకు సూచించారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ చూపాలన్నారు.
Similar News
News April 17, 2026
LNG ఇంపోర్ట్స్.. భారత్‌కు ఇక బోలెడన్ని ప్రత్యామ్నాయాలు!

LNG కోసం ఇప్పటివరకు ఎక్కువగా ఖతర్‌పైన ఆధారపడిన భారత్ పశ్చిమాసియా యుద్ధ పరిణామాలతో కొత్త సోర్సులను కనెక్ట్ చేసుకుంది. ఏడేళ్ల గ్యాప్ తర్వాత నార్వే నుంచి, రెండేళ్ల విరామం తర్వాత రష్యా నుంచి భారత్‌కు త్వరలో LNG కార్గోలు రానున్నట్లు సమాచారం. ఇక ఆఫ్రికా దేశాల నుంచి 1.2 మిలియన్ టన్నుల LNGకి భారత్ ఆర్డర్ చేసింది. ఇందులో ఆరు నౌకలు గత నెల భారత్ చేరుకోగా మరో 7,54,000 టన్నుల LNG ఈనెలాఖరుకు రానుంది.
News April 17, 2026
హెచ్‌పీవీ టీకా కార్యక్రమం వేగవంతం చేయాలి: కలెక్టర్

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఆయుష్ సేవలు, యోగా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తెలిపారు. హెచ్‌పీవీ టీకాలు రెండు నెలల్లో 6 వేలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్‌కే ద్వారా పిల్లల పరీక్షలు, గర్భిణుల సంరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపుపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
News April 17, 2026
బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


