News April 23, 2025
రాజమండ్రి: వ్యభిచారం నిర్వహిస్తున్న అన్నా చెల్లెలు

వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో రాజమండ్రిలోని ఓ స్పా సెంటర్‌పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. సీఐ మురళీకృష్ణ వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మదన్, తేజస్విలు అన్నా చెల్లెలు. వీరు విజయవాడ నుంచి వచ్చి రాజమండ్రిలో స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. బ్యూటీషియన్ కోర్సు నేర్పిస్తామని యువతులకు ఎరవేసి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. ఐదుగురు యువతులు, విటులను పట్టుకున్నారు.
Similar News
News December 16, 2025
రంగారెడ్డి: FREE కోచింగ్.. ఫోన్ చేయండి

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ చిలుకూరు డైరెక్టర్ ఎండీ.అలీఖాన్ తెలిపారు. 19 నుంచి 45 సంవత్సరాలలోపు ఉన్న మహిళలకు కుట్టుమిషన్ కోర్సులలో ఉచిత శిక్షణ అందిస్తామని తెలిపారు. SSC MEMO, రేషన్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, 4 ఫొటోలతో ఈనెల 17లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నం 8500165190కు సంప్రదించాలన్నారు.
News December 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 16, మంగళవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.21 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.02 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 16, 2025
NLG: మూడో విడతలో మద్యం మాయ..!

ఈనెల 17న నిర్వహించనున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుండగా, అనేక గ్రామాల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, చికెన్ పంపిణీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేయగా, మరికొన్ని గ్రామాల్లో ఇంటింటికీ కిలో చికెన్, ఫుల్ బాటిల్ మందు అందజేశారు. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.


