News April 23, 2025

టెర్రర్ అటాక్.. ప్రధాని మోదీ కీలక సమావేశం

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ సమావేశం నిర్వహించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి జై శంకర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఈ భేటీలో పాల్గొన్నారు. నిన్న జరిగిన టెర్రర్ అటాక్‌లో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

Similar News

News April 18, 2026

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఇవాళ వర్ష సూచన ఉంది. ఏపీలోని విశాఖ, మన్యం, అల్లూరి, పోలవరం, ప.గో, ఏలూరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. తెలంగాణలోని రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో వానలు పడొచ్చని HYD వాతావరణ కేంద్రం పేర్కొంది. మరోవైపు ఏపీలోని 27 మండలాల్లో, TGలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచనున్నాయి.

News April 18, 2026

కాళ్ల బేరానికొచ్చిన ట్రంప్?

image

ఇరాన్‌ను నాశనం చేసి హార్ముజ్‌ను స్వాధీనం చేసుకుంటామని ఇన్నాళ్లూ పెద్దపెద్ద ప్రకటనలు చేసిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపై ప్రేమను ఒలకబోస్తున్నారు. హార్ముజ్‌ను ఓపెన్ చేశామని ప్రకటించడంతో ఏకంగా థాంక్స్ చెప్పారు. ఇరాన్ అందమైన దేశమంటూ కీర్తించారు. యుద్ధంలో గెలవడం చేతగాకే ట్రంప్ ఇలా మాట్లాడుతున్నారని పలువురు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఇక ఇరాన్ యురేనియం ఇచ్చేస్తుందన్న ట్రంప్ <<19679151>>ప్రకటనా<<>> ఉత్తదే అని తేలింది.

News April 18, 2026

అందుకే మ్యాచ్‌లకు రావట్లేదన్న డింపుల్ బ్యూటీ

image

PBKS యజమాని ప్రీతి జింటా గత సీజన్ వరకూ స్టేడియానికి వచ్చి తన జట్టుకు సపోర్ట్ చేసేవారు. అయితే ఈ సీజన్‌లో జట్టు విజయాలతో దూసుకెళ్తున్నా ఆమె స్టేడియంలో కనిపించకపోవడంతో SM వేదికగా ఫ్యాన్స్ ప్రశ్నించారు. దీంతో ఆమె రిప్లై ఇచ్చారు. ‘చాలా కాలంగా పిల్లలకు దూరంగా ఉన్నా. ప్రస్తుతం వాళ్లకు సెలవులు. వారితో గడపడానికే మ్యాచ్‌లకు రావట్లేదు. త్వరలోనే స్టేడియంలో కనిపిస్తా’ అని చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.