News March 28, 2024

నల్లమిల్లికి చంద్రబాబు ఫోన్

image

AP: అనపర్తి నియోజకవర్గ TDP ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు <<12940627>>ఫోన్<<>> చేశారు. ఈ సందర్భంగా టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణాలను వివరించినట్లు సమాచారం. ‘పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారు. మీ కోసం తెగించి పోరాడిన కొద్ది మందిలో నేనూ ఒకడిని. నాడు YSR పిలిచినా మా కుటుంబం మీ వెంటే నడిచింది. 40 ఏళ్ల మా కుటుంబ పోరాటాన్ని మరిచారా’ అని నల్లమిల్లి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Similar News

News April 20, 2026

GK: ముఖ్యమైన సంస్థలు – హెడ్‌క్వార్టర్స్

image

* WHO – జెనీవా
* UNESCO – పారిస్
* ILO – జెనీవా
* FAO – రోమ్
* UNICEF – న్యూయార్క్
* IMF – వాషింగ్టన్, డి.సి
* World Bank – వాషింగ్టన్, డి.సి
* WTO – జెనీవా

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News April 20, 2026

అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

image

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.