News March 28, 2024
సూర్య కొత్త సినిమా టైటిల్ ఇదే

స్టార్ హీరో సూర్య తన తదుపరి చిత్రంపై అప్‌డేట్ ఇచ్చారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 44వ మూవీ చేయనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ‘Love Laughter War (ప్రేమ-నవ్వు-యుద్ధం)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ నిర్మించనుంది. సూర్య ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 14, 2026
ఒకప్పుడు ₹2వేల కోట్ల ఆస్తులు.. కానీ ఇప్పుడు..!

దర్భాంగా ఫ్యామిలీ (బిహార్) దేశంలోని రిచెస్ట్ రాయల్ ఫ్యామిలీలలో ఒకటి. ఈ ఫ్యామిలీ చివరి మహారాణి కామసుందరి దేవి(96) ఈ నెల 12న చనిపోయారు. ఆమె భర్త, చివరి మహారాజు కామేశ్వర్ సింగ్ 1962లో చనిపోగా, అప్పుడు ఈ ఫ్యామిలీ ఆస్తుల విలువ ₹2,000Cr(ప్రస్తుత వాల్యూ ₹4లక్షల కోట్లు). ఇందులో ఇప్పుడు 2% కంటే తక్కువే ఉన్నట్లు సమాచారం. 1962 IND-CHN యుద్ధం సమయంలో ఈ ఫ్యామిలీ ప్రభుత్వానికి 600kgs గోల్డ్ సాయం చేసింది.
News January 14, 2026
APPLY NOW: BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

BOB క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్‌లో వివిధ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBA/CFA/CA,M.COM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తును careers@bobcaps.in ఈమెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://www.bobcaps.in
News January 14, 2026
నేడే జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం

మకర సంక్రాంతి సందర్భంగా శబరిమలలో నేడు మకర జ్యోతి దర్శనమివ్వనుంది. ఈ దివ్య జ్యోతిని సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపంగా భావిస్తారు. స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి జ్యోతి రూపంలో వచ్చారని విశ్వసిస్తారు. కఠినమైన దీక్షలో ఉన్న మాలధారులు ఈ జ్యోతిని వీక్షించిన తర్వాతే తమ దీక్షను విరమిస్తారు. ఈ పవిత్ర దర్శనం భక్తుల మనసులకు ప్రశాంతతను, పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు.


