News April 23, 2025

భయం భయం.. జమ్మూను వీడుతున్న పర్యాటకులు

image

పహల్‌గామ్ ఘటనతో జమ్మూకశ్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అక్కడ ఉన్న టూరిస్టులు వారి నివాస స్థలాలకు పయనమవుతున్నారు. దీంతో శ్రీనగర్ విమానాశ్రయం ప్రయాణికులతో నిండిపోయింది. రద్దీ దృష్ట్యా ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. కాగా రహదారిపై కొండచరియలు పడటంతో తాత్కాలికంగా దానిని మూసివేశారు. దీంతో రైలు లేదా విమాన మార్గాల్లో వెళ్లాల్సి వస్తుంది.

Similar News

News April 23, 2025

SRH 4 వికెట్లు డౌన్

image

MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.

News April 23, 2025

IPL: రూ.కోట్లు ఇస్తున్నా కుర్చీకే పరిమితం!

image

IPL మెగా వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించి కొందరిని సొంతం చేసుకున్నాయి. కానీ తీరా టోర్నీలో మాత్రం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నాయి. వీరిలో నటరాజన్ (రూ.10.75 కోట్లు), జాకబ్ బేతేల్ (రూ.2.6cr), గెరాల్డ్ కొయెట్జీ (రూ.2.4cr), డెవాల్డ్ బ్రెవిస్ (రూ.2.2cr), లామ్రోర్ (రూ.1.7cr), తుషారా (రూ.1.6cr), మపాకా (రూ.1.5cr), పావెల్ (రూ.1.5cr), హర్దీ (రూ.1.25cr) ఎంగిడి రూ.కోటి) తదితరులు ఉన్నారు.

News April 23, 2025

మద్యం కుంభకోణంలో మరో నిందితుడు అరెస్ట్

image

AP: మద్యం కుంభకోణం వ్యవహారంలో పోలీసులు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ స్కామ్‌కు సంబంధించి రాజ్ కసిరెడ్డి అరెస్ట్ కాగా, తాజాగా A8 చాణక్యను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన అతడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, రాజ్ కసిరెడ్డి విచారణలో పూర్తి వివరాలు వెల్లడించలేదని సిట్ అధికారులు కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!