News April 23, 2025
ఉగ్రదాడి.. ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు మృతదేహాలు

పహల్‌గామ్ ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28కి చేరినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఇద్దరు విదేశీయులు (నేపాల్, UAE) ఉన్నట్లు తెలిపారు. నాలుగు ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలిస్తున్నారు. నిన్న ఉగ్రవాదులు సైనికుల దుస్తుల్లో వచ్చి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. మొత్తం ఆరుగురు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
Similar News
News April 19, 2026
నితీశ్ బౌలింగ్ వెనుక స్టీఫెన్ జోన్స్?

తన బౌలింగ్ మెరుగవడం వెనుక ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారని, ఆయనెవరో ఇప్పుడే చెప్పనని ఇటీవల ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ తెలిపారు. అయితే బౌలింగ్ కోచ్ స్టీఫెన్ జోన్స్(UK) పర్యవేక్షణలో NKR ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగళూరులోని పదుకొణె-ద్రవిడ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌లో వారంపాటు ఈ సెషన్ జరిగినట్లు సమాచారం. నితీశ్ స్పీడ్ గతంలో 120-125Kmph ఉండగా ఇప్పుడు 135-139Kmph వేస్తూ వికెట్లు తీస్తున్నారు.
News April 19, 2026
భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌పై రేపటి నుంచి చర్చలు!

USతో ట్రేడ్ డీల్ తొలి ఫేజ్ అమలుపై భారత్ ఆ దేశంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరపనుంది. ట్రంప్ టారిఫ్స్‌ను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత తొలిసారిగా భారత్ బృందం వాషింగ్టన్‌కు చర్చలకు వెళ్లనుంది. దీంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్ సహా 16 దేశాల వాణిజ్యంపై ట్రంప్ దర్యాప్తునకు ఆదేశించడంపైనా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇండియా USకు 10% టారిఫ్ చెల్లిస్తోంది.
News April 19, 2026
పండ్లకు స్ట్రిప్ పేపర్ టెస్ట్.. ఎలా చేస్తారు?

‘కాల్షియం కార్బైడ్’ వాడకంపై FSSAI కఠిన చర్యలు చేపట్టింది. ఇప్పటికే మామిడి, అరటి, బొప్పాయి షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని రాష్ట్రాలను <<19672510>>ఆదేశించింది.<<>> స్ట్రిప్ పేపర్ టెస్ట్ చేయాలని సూచించింది. ఇందుకోసం పొటాషియం పర్మాంగనేట్‌తో శుద్ధి చేసిన పేపర్ లేదా రియాక్టివ్ స్ట్రిప్స్‌ను వాడతారు. దీన్ని పండ్లపై పెట్టగానే రంగు మారితే కృత్రిమంగా పండించే కెమికల్స్ ఉపయోగించినట్లు. ఈ స్ట్రిప్స్ ఆన్‌లైన్‌లోనూ దొరుకుతాయి.


