News April 23, 2025

BIG BREAKING: టెన్త్ ఫలితాలు విడుదల

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి లోకేశ్ X వేదికగా ఫలితాలను ప్రకటించారు. Way2News యాప్‌ ఓపెన్ చేయగానే కనిపించే స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి మీ రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఆ మార్క్స్ జాబితాను సులభంగా ఇతరులకు షేర్ చేయొచ్చు.
SHARE IT

Similar News

News January 18, 2026

ట్విస్ట్ అంటే ఇది.. BJPకి షిండే షాక్ ఇస్తారా?

image

BMC ఫలితాల్లో ఏ సింగిల్ పార్టీకీ మెజారిటీ లేదు. 29 సీట్లు గెలిచిన మహాయుతిలోని షిండే సేన ఇప్పుడు కింగ్‌మేకర్‌గా మారింది. దీంతో మేయర్ పీఠమే లక్ష్యంగా ఆయన తన కార్పొరేటర్లను హోటల్‌కు తరలించారు. 114 మార్కు చేరాలంటే BJPకి షిండే సపోర్ట్ తప్పనిసరి. ప్రతిపక్షాలన్నీ కలిస్తే మెజారిటీకి 8 సీట్ల దూరంలోనే ఉన్నాయి. అందుకే హార్స్ ట్రేడింగ్ జరగకుండా, మేయర్ పీఠంపై గురితో షిండే ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

News January 18, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. మరికొన్ని చోట్ల రూ.300పైనే కొనసాగుతున్నాయి. HYDలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.300-320గా ఉంది. గుంటూరు, విశాఖలో రూ.300, నంద్యాల రూ.260-300, కామారెడ్డిలో రూ.300-310, కర్నూలులో రూ.310-320కి విక్రయిస్తున్నారు. అమలాపురంలో రూ.250 నుంచి రూ.300కి పెరిగింది. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News January 18, 2026

మీ ఇంట్లో సూర్యుడి విగ్రహం ఉందా?

image

చాలామంది ఇళ్లల్లో దేవుళ్ల విగ్రహాలు ఉంటాయి. కానీ సూర్యుడి విగ్రహాన్ని మాత్రం పెట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే సూర్యుడు మనకు రోజూ ప్రత్యక్ష దైవంగా కనిపిస్తాడు. ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆ భాస్కరుడిని చూస్తూ నమస్కరించుకోవడం, అర్ఘ్యం వదలడం శ్రేష్ఠం. ప్రకృతిలోనే దైవాన్ని దర్శించుకునే అవకాశం ఉన్నప్పుడు, విగ్రహ రూపం కంటే నేరుగా సూర్యుడిని ఆరాధించడమే అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది.