News April 23, 2025

ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యంలో 3 రోజులు సంతాపదినాలు

image

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేయాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News August 14, 2025

యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

image

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.

News August 14, 2025

నటుడు దర్శన్ బెయిల్ రద్దు

image

రేణుకాస్వామి హత్య కేసులో నిందితులైన కన్నడ నటుడు దర్శన్‌, పవిత్ర గౌడ సహా మరో ఐదుగురికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కర్ణాటక హైకోర్టు వారికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ తాజాగా తీర్పు ఇచ్చింది. తక్షణమే వారిని అదుపులోకి తీసుకోవాలని ఆ రాష్ట్ర పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కాగా వారికి కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

News August 14, 2025

కుక్కల తరలింపుపై పిటిషన్లు.. అధికారులపై SC ఫైర్

image

ఢిల్లీలో వీధి కుక్కల బెడద లేకుండా చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ <<17396741>>పిటిషన్లు<<>> దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై విచారణ సందర్భంగా అధికారులపై SC ఫైరైంది. ‘పార్లమెంట్ తీసుకొచ్చిన రూల్స్, చట్టాలు అమలు కావడం లేదు. లోకల్ అథారిటీస్ సక్రమంగా పని చేయట్లేదు. దీనిపై బాధ్యత తీసుకోవాలి’ అని వ్యాఖ్యానించింది. పిటిషన్లపై ఆర్డర్‌ను రిజర్వ్ చేసింది. అయితే గత తీర్పుపై స్టే విధించలేదు.