News April 23, 2025

ప.గో : టెన్త్ రిజల్ట్స్..17,695 మంది పాస్

image

పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప.గో.జిల్లాలో మొత్తం 21,539 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 17,695 మంది పాసయ్యారు. 10,924 మంది బాలురు రాయగా 8,612 మంది పాసయ్యారు.10,615 మంది బాలికలు పరీక్ష రాయగా 9,083 మంది పాసయ్యారు. 82.15 పాస్ పర్సంటేజ్ తో పశ్చిమగోదావరి జిల్లా 16 వ స్థానంలో నిలిచింది.

Similar News

News September 10, 2025

పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్‌లో వర్క్ ఫ్రం హోం, ఈ కేవైసీ, వాహనాల ఆధార్ సీడింగ్, తల్లికి వందనం, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో బుధవారం సమీక్షించారు. కౌశలం సర్వే, పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేషన్, వాట్సాప్ గవర్నెన్స్, ఈపీటీఎస్ ఫైల్స్ అప్‌లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.

News September 10, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

News September 10, 2025

వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలి: కలెక్టర్

image

రసాయన రహిత వ్యవసాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ద్వారా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకంలో భాగంగా కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే జిల్లాలో 75 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు నడుస్తోందన్నారు.