News April 23, 2025

10th RESULTS: 21వ స్థానంలో ఏలూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 22,365 మంది పరీక్ష రాయగా 17,274 మంది పాసయ్యారు. 11,168 మంది బాలురులో 8,146 (72.94%) మంది, 11,197 మంది బాలికలు పరీక్ష రాయగా 9,128 (81.52%) మంది పాసయ్యారు. మొత్తంగా 77.24% పాస్ పర్సంటైజ్ నమోదయింది.

Similar News

News January 13, 2026

రాయచోటి జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేధించాలని వినతి

image

రాయచోటి జిల్లా డిమాండును ప్రభుత్వానికి నివేదించాలని రాయచోటి జిల్లా సాధన సమితి నాయకులు మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనుకబడ్డ రాయచోటిని జిల్లా చేస్తే మన ప్రాంతం అభివృద్ధి సాధిస్తుందని సాధన సమితి నాయకులు మంత్రికి వివరించారు.

News January 13, 2026

మెదక్: అడవిలో కుళ్లిన మృతదేహం లభ్యం

image

కొల్చారం మండలంలో మృతదేహం కలకలం రేపింది. మండల పరిధిలోని ఆరోగ్య కేంద్రం వెనుక భాగం రిజర్వుడ్ ప్రాంతంలో కుళ్లిన మృతదేహన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళా కుళ్లిన మృతదేహంగా గుర్తించారు. ఎవరైనా తప్పిపోయి ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మృతురాలికి 45 సంవత్సరాలు ఉంటుందని, 15 రోజుల క్రితం మృతి చెందినట్లు చెప్పారు.

News January 13, 2026

అనకాపల్లి: విద్యుత్ టారిఫ్‌పై 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

image

విద్యుత్తు ఛార్జీల టారిఫ్‌పై ఈనెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినట్లు ఎస్ఈ జి. ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీఈఆర్పీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో 4 రోజులపాటు తిరుపతి, విజయవాడ, కర్నూల్‌లో అభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. అభిప్రాయాలు చెప్పదలుచుకున్నవారు అనకాపల్లి, కసింకోట, నర్సీపట్నం విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నామన్నారు.