News April 23, 2025
పాతికేళ్ల క్రితం ఇలాంటి ఉగ్రదాడే..

US వైస్ ప్రెసిడెంట్ వాన్స్ భారత పర్యటనలో ఉండగా జరిగిన ఉగ్రదాడి తరహాలోనే.. పాతికేళ్ల క్రితం అప్పటి US ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పర్యటన సమయంలోనూ ఓ అటాక్ జరిగింది. లష్కరే తోయిబా ఉగ్రమూక భారత ఆర్మీ దుస్తులు ధరించి అనంతనాగ్‌లోని చిట్టిసింగ్‌పురాకు వెళ్లారు. పురుషులను గురుద్వారా ముందు లైన్‌లో నిల్చోబెట్టి కిరాతకంగా కాల్పులు జరిపారు. ఆ ఊచకోతలో 35 మంది సిక్కులు తమ ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News August 16, 2025
రేపు NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు?

NDA తరఫు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై నేతలు కసరత్తు మొదలుపెట్టారు. రేపు ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నట్లు సమాచారం. అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు NDA పక్షాలు అప్పగించాయి. ఈ నెల 21తో నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో అభ్యర్థి ఎంపికను రేపే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది.
News August 16, 2025
విషమంగా యువరాణి ఆరోగ్యం.. మూడేళ్లుగా ఆస్పత్రిలోనే

థాయ్‌లాండ్ యువరాణి బజ్రకితియాభా(46) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 2022 DECలో పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన ఆమె మూడేళ్లుగా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె లంగ్స్, కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయని రాయల్ ప్యాలెస్ తాజాగా ప్రకటించింది. బ్లడ్‌లో ఇన్ఫెక్షన్లూ ఉన్నట్లు చెప్పింది. ‘ప్రిన్సెస్ భా’గా పేరు పొందిన ఆమె థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కోర్న్ ముద్దుల కుమార్తె.
News August 16, 2025
కృష్ణాష్టమి రోజు ఎలా పూజ చేయాలంటే?

త్వరగా లేచి స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. చిన్నికృష్ణుడి విగ్రహం/చిత్రపటాన్ని అలంకరించుకోవాలి. కన్నయ్యకు ఆహ్వానం పలుకుతూ వరిపిండితో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేసుకోవాలి. వెన్న, అటుకులు, కలకండ, నెయ్యితో చేసిన లడ్డూలు వంటివి ప్రసాదంగా సమర్పించాలి. ఈరోజు భక్తితో ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేస్తే శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని, పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.