News April 23, 2025

11వ స్థానానికి ఎగబాకిన పల్నాడు జిల్లా

image

పల్నాడు జిల్లా పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించింది. ఈసారి 25,382 మంది విద్యార్థులలో 21,358 మంది ఉత్తీర్ణత సాధించారు. 84.15 శాతం పాస్ పర్సంటైల్ నమోదు అయింది. గతేడాది 86.05 శాతంతో 18వ స్థానంలో ఉన్న జిల్లా, ఈసారి 11వ స్థానానికి ఎగబాకడం గమనార్హం. విద్యార్థులు, అధ్యాపకుల కృషికి ఫలితంగా ఈ పురోగతి సాధ్యమైందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Similar News

News April 23, 2025

SRH 4 వికెట్లు డౌన్

image

MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన సిక్కోలు ఆణిముత్యాలు

image

నేడు విడుదలైన SSC ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. 550 దాటిన మార్కుల్లో అమ్మాయిలదే పైచేయి. లావేరుకు చెందిన హరిత 600కి 592 మార్కులు వచ్చాయి. పలు మండలాల్లో ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్ ఎన్ పేట- 569( జాహ్నవి) , టెక్కలి- 577( లావణ్య), లావేరు-578( కుసుమ శ్రీ), రణస్థలం – 590(ఝాన్సీ) పది ఫలితాల్లో అదరగొట్టారు.

News April 23, 2025

వీరయ్య చౌదరి హత్యపై రెండు జిల్లాల పోలీసుల చర్చలు

image

TDP అధికార ప్రతినిధి, మాజీ MPP వీరయ్య చౌదరి హత్య విచారణకు సంబంధించి, తీసుకోవలసిన చర్యలపై బాపట్ల SP తుషార్ డూడి, ప్రకాశం SP దామోదర్ ఇరువురు చర్చించుకున్నారు. CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పక్క పక్కనే ఉన్న రెండు జిల్లాల ఎస్పీలు హత్య విచారణకు సంబంధించిన విషయాలు చర్చించుకోవడంతో హంతకులను త్వరలోనే అరెస్టు చేయటానికి పోలీస్ శాఖ సిద్ధమైనట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

error: Content is protected !!