News April 23, 2025
టెన్త్ ఫలితాలు: 6 నుంచి 24వ స్థానానికి చిత్తూరు జిల్లా

ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో చిత్తూరు జిల్లాలో ఉత్తీర్ణత శాతం తీవ్ర నిరాశకు గురి చేసింది. గతేడాది టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది 67.06 శాతంతో 24వ స్థానంలో నిలిచింది. ఏడాది వ్యవధిలో దాదాపు 18 స్థానాలు దిగజారడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు.
Similar News
News November 10, 2025
అవినీతికి పాల్పడితే చర్యలు: కలెక్టర్

వ్యవసాయ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ జేడీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, అర్హులకు వాటిని అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎవరన్నా అవినీతికి పాల్పడితే చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
News November 10, 2025
చిత్తూరు పోలీసులకు 43 ఫిర్యాదులు

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ తుషార్ డూడీ వినతులు స్వీకరించారు. 43 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. చట్ట ప్రకారం వాటిని విచారించి బాధితులకు సత్వరమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు.
News November 9, 2025
త్వరలోనే ఏనుగుల సమస్యలకు పరిష్కారం: పవన్

ఏనుగుల గుంపుతో కన్నా ఒంటరి ఏనుగుతోనే ఎక్కువ ప్రమాదమని MLA అమర్‌నాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన Dy.CM పవన్‌తో కలిసి పలమనేరులోని కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు ‘ఏనుగులతో సమస్యలు వాటి పరిష్కార మార్గాలను’ వివరించారు. కుంకీ ఏనుగులతో ఒంటరి ఏనుగులకు చెక్ పెట్టవచ్చని, దీనికి సాంకేతిక తోడైతే మరింత ప్రయోజనం ఉంటుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, DFO పాల్గొన్నారు.


