News April 23, 2025
10th RESULTS: హ్యాట్రిక్ కొట్టిన పార్వతీపురం మన్యం జిల్లా

పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలించింది.
➤ 2022-23 విద్యా సంవత్సరంలో 10,694 మంది పరీక్ష రాయగా 9,356(87.4%) మంది పాసయ్యారు
➤ 2023-24 విద్యా సంవత్సంలో 10,443 మంది పరీక్షకు హాజరవ్వగా 10,064(96.37%) మంది ఉత్తీర్ణత సాధించారు
➤ ఈఏడాది(2024-25) 10,286 మంది పరీక్ష రాయగా 9,659 (93.90%) మంది పాసయ్యారు.
Similar News
News April 23, 2025
ఆ సమయంలో ఫోన్ వాడకండి!

వేసవి కావడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఎలక్ట్రానిక్ డివైజ్‌లు పేలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే సెల్‌ఫోన్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడికి ఫోన్లు ఓవర్ హీట్ అవుతాయి. ఆ సమయంలో మొబైల్‌కు అలర్ట్ మెసేజ్ కూడా వస్తుంది. అప్పుడు ఫోన్ వాడకూడదు. చల్లగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లి, బ్యాటరీ కూల్ అయ్యాకే వినియోగించాలి.
News April 23, 2025
ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.
News April 23, 2025
SRH 4 వికెట్లు డౌన్

MIతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 13 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు హెడ్, కిషన్, అభిషేక్, నితీశ్ కుమార్ రెడ్డి వెంటవెంటనే వెనుదిరిగారు. ఉప్పల్ లాంటి బ్యాటింగ్ పిచ్‌పై ఇలాంటి బ్యాటింగ్ ఏంటని ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. 4.1 ఓవర్లకు SRH స్కోర్ 13/4.