News April 23, 2025

కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో భిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో భిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News April 24, 2025

బోధన్: భూ సమస్యల పరిష్కారానికే భూభారతి చట్టం: కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ మీటింగ్ హల్‌లో బుధవారం భూ భారతిపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకువచ్చిందని పేర్కొన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. భూ భారతి సేవల గురించి ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.

News April 23, 2025

NZB: ఇంటర్ రిజల్ట్స్.. విద్యార్థి అదృశ్యం

image

సాలూర మండలం హున్సా గ్రామానికి చెందిన కలసాయి కృష్ణ మంగళవారం మధ్యాహ్నం నుంచికనబడడం లేదని కుటుంబీకులు ఆందోళనకు గురవుతున్నారు. ఇటీవలే ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష రాసిన సాయికృష్ణ నిన్న ఫలితాలు వెలుబడినప్పటి నుంచి కనబడకపోవడంతో గ్రామంలో, బంధువుల వద్ద వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో భయాందోళన గురవుతున్నారు. నేడు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

News April 23, 2025

NZB: ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులు

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో విద్యార్థినులు అత్యధిక మార్కులు సాధించారని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీలో బి.జ్యోతిర్మయి 956, బైపీసీలో మలిహ ఆర్ఫీన్ 974, బైపీసీ ఉర్దూ మీడియంలో 963 మార్కులు, ఒకేషనల్ ఎస్. పూజ 974 మార్కులు సాధించారని చెప్పారు.

error: Content is protected !!