News March 28, 2024
యూఎన్ రిపోర్టును తప్పుబట్టిన కేంద్రమంత్రి
భారత్‌లో నిరుద్యోగ పరిస్థితి అధ్వానంగా ఉందన్న UN రిపోర్టును కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తప్పుబట్టారు. భారతీయ సంస్థల సర్వేల్లో భిన్నమైన గణాంకాలు ఉన్నాయన్నారు. ‘EPFOలో 6.4కోట్ల మంది రిజిస్టర్ అయ్యారు. ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా కంటే ఎక్కువ. 34 కోట్ల ముద్రా లోన్లు మంజూరు కాగా వీటితో చాలా మంది ఉపాధిని సృష్టిస్తున్నారు. మనం విదేశీ రేటింగ్ సంస్థలపై ఆధారపడటం మానుకోవాలి’ అని పేర్కొన్నారు.
Similar News
News November 6, 2024
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో భూఆక్రమణల నిరోధక చట్టం-1982 రద్దు ప్రతిపాదనపై చర్చించే అవకాశం ఉంది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ అండ్ ప్రొహిబిషన్ బిల్లు-2024కు ఆమోదం పలుకుతుందని సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా చేపట్టిన పనుల గురించి చర్చించే ఛాన్స్ ఉంది.
News November 6, 2024
దూసుకెళ్తున్న ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. ‘అసోసియేట్ ప్రెస్’ ప్రకారం ఆయన ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో జయకేతనం ఎగురవేశారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ 30 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. మొత్తంగా ఆయన ఖాతాలో 95 ఓట్లు చేరాయి. కమల 5 రాష్ట్రాల్లో గెలుపొంది 35 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. 40 ఓట్లున్న టెక్సాస్‌లో ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
News November 6, 2024
త్వరలో వరంగల్ మాస్టర్ ప్లాన్ విడుదల
TG: 2050 నాటి జనాభాను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే సీఎం రేవంత్ చేతుల మీదుగా విడుదల చేయనుంది. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్‌లకు అవసరమైన భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులకు సూచించింది. ఏడాదిలోపు మామునూరు ఎయిర్‌పోర్టు అందుబాటులోకి తీసుకొచ్చేలా, కార్గో సేవలూ అందించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది.