News April 23, 2025

PHOTO: పహల్‌గామ్‌లో దాడి చేసింది వీరే

image

జమ్మూ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఫొటో బయటకు వచ్చింది. నలుగురు ముష్కరులు కలిసి ఉన్న ఫొటోను అధికారులు విడుదల చేశారు. వారి చేతుల్లో తుపాకులు ఉన్నాయి. వీరిలో ముగ్గురిని ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా అధికారులు గుర్తించారు. నిన్న వీరు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయిన విషయం తెలిసిందే.

Similar News

News April 16, 2026

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు నా దగ్గర టైమ్ లేదు: మృణాల్

image

రిలేషన్‌షిప్, మ్యారేజ్‌కు ప్రస్తుతం తన వద్ద టైమ్ లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. తాను సినిమాలతో బిజీగా ఉన్నానని చెప్పారు. ‘ఈమధ్య నా కాలుకు దెబ్బ తగిలింది. బిజీ షెడ్యూల్ వల్ల ట్రీట్‌మెంట్ చేయించుకోలేకపోయాను. అలాంటిది రిలేషన్‌షిప్‌కు నా దగ్గర టైమ్ ఎక్కడ ఉంటుంది. ఎవరితో డేటింగ్ చేస్తున్నానన్న దానికంటే నేను చేసే పని వల్లే నాకు గుర్తింపు రావాలి’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News April 16, 2026

తమిళనాడులో TVK విజయ్ మ్యానిఫెస్టో.. పెళ్లికి 8 గ్రా. బంగారం

image

*60 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలకు నెలకు రూ.2,500
*ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు
*పేదవారి పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టు చీర
*ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు
*పిల్లలను ప్రభుత్వ స్కూళ్లల్లో చదివిస్తే ఏడాదికి రూ.15వేలు
*ఉన్నత విద్యకు రూ.20 లక్షల వరకు లోన్లు
*రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు
*రైతుల పంట రుణాలు మాఫీ

News April 16, 2026

భగ్గుమన్న భానుడు.. సీజన్లో తొలిసారి..

image

తెలంగాణలో భానుడు నిప్పులు చిమ్ముతున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటింది. ఇవాళ అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 44.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 44.3, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 2-3 రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.