News March 28, 2024

‘ప్రతినిధి-2’ టీజర్‌ రిలీజ్‌ టైమ్ ఫిక్స్‌

image

యంగ్ హీరో నారా రోహిత్‌ నటిస్తున్న ‘ప్రతినిధి-2’ మూవీ నుంచి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సినిమా టీజర్‌‌‌ రేపు విడుదల కానుంది. శుక్రవారం ఉదయం 10.08 గంటలకు మెగాస్టార్ చిరంజీవి టీజర్‌ను విడుదల చేస్తారని మేకర్స్ తెలిపారు. ప్రముఖ జర్నలిస్ట్‌ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన కాన్సెప్ట్‌ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

Similar News

News April 6, 2026

బ్రాండింగ్ కోసం బౌండరీ దాటిన జొమాటో.. ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్నటి IPL మ్యాచ్ సందర్భంగా జొమాటో చేసిన ఓ పోస్ట్ తమిళనాడు, కర్ణాటక అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ‘చెన్నై సాంబార్ కంటే బెంగళూరు సాంబార్ బెటర్’ అంటూ ZOMATO చేసిన పోస్ట్ తమ ప్రాంతీయ సంస్కృతిని, ఆహారపు అలవాట్లను కించపరిచేలా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రచారం కోసం ప్రాంతీయ సెంటిమెంట్లతో ఆడుకోవడం సరికాదని ఫైర్ అవుతున్నారు. చాలామంది జొమాటో యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేసి పోస్టులు పెడుతున్నారు.

News April 6, 2026

కాలు వాపుగా ఉందా? ప్రాణాపాయం కావచ్చు: రాజీవ్ కనకాల

image

కాలు వాపు, నొప్పి లేదా వేడి చేసినా నిర్లక్ష్యం చేయవద్దని నటుడు రాజీవ్ కనకాల సూచించారు. ఇది రక్త గడ్డలకు (DVT) సంకేతం కావచ్చని హెచ్చరించారు. ‘ఈ గడ్డలు ఊపిరితిత్తులకు చేరితే ప్రాణాపాయం కలగవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం, లాంగ్ ట్రావెల్ చేసేవారు మధ్యమధ్యలో నడవాలి. నీళ్లు బాగా తాగాలి. సకాలంలో గుర్తిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు’అని ఆయన అవగాహన కల్పించారు.

News April 6, 2026

ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ.. 6 వేల మందికి ఉద్యోగాలు!

image

TG: 2026-27 నుంచి 3 వేల స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. UKG క్లాసులు అవసరమైన పాఠశాలల లిస్టు పంపాలని DEOలకు ఆదేశాలిచ్చింది. దీంతో కొత్తగా 6 వేల మందికి తాత్కాలికంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1,300కు పైగా స్కూళ్లలో UKG క్లాసులు నడుస్తున్నాయి. వాటిలో ఆయాలు, ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ₹6 వేలు, ₹8 వేల చొప్పున ప్రభుత్వం వేతనం ఇస్తోంది.