News April 23, 2025

ఎన్టీఆర్: ప్రధాని పర్యటన రూట్ మ్యాప్‌ను పరిశీలించిన అధికారులు

image

మే 2న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సంబంధిత రూట్ మ్యాప్‌ను అధికారులు బుధవారం పరిశీలించారు. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు అనుసంధానమై ఉన్న సీడ్ యాక్సిస్ రహదారుల జంక్షన్‌లను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ చంద్‌, ఇతర అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ రవికుమార్, NHAI ప్రాజెక్టు డైరక్టర్ పార్వతీశం,CRDA అధికారులతో కలసి ఆయా రహదారులను రూట్ మ్యాప్ నిమిత్తం పరిశీలించారు.

Similar News

News April 18, 2026

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

స్వచ్ఛతను కాపాడుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్ రాజకుమారి సూచించారు. శనివారం నంద్యాలలోని పొన్నాపురం కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కాలనీలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని అన్నారు. కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

News April 18, 2026

మదనపల్లెలో నేటి టమాటా ధరల వివరాలు.!

image

మదనపల్లె టమాటా మార్కెట్లో కిలో టమాటాలు రూ.24కి కొనుగోలు చేశారు. మదనపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి శనివారం 165 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకు వచ్చారు. స్థానిక వ్యాపారులు 10 కిలోల మొదటి రకం టమాటాల బాక్స్ రూ.240 చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేశారు. అలాగే రెండవ రకం టమాటాలు రూ.190 అమ్ముడు పోగా.. మూడవ రకం టమాటాలు రూ.180 పలకడంతో రేట్లు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు.

News April 18, 2026

ప్రతిపక్షాలపై PM మోదీ ఆగ్రహం

image

కేంద్ర క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. మరోవైపు మహిళా బిల్లును అడ్డుకోవడం ఘోర పాపమని, పైగా సంబరాలు చేసుకోవడం ఏంటని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రశ్నించారు.