News April 23, 2025

ఎన్టీఆర్: ప్రధాని మోదీ పర్యటనకు 120 ఎకరాలలో పార్కింగ్ ఏర్పాట్లు

image

మే 2న అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా CRDA అధికారులు విస్తృత సన్నాహాలు చేస్తున్నారు. సెక్రటేరియట్ సమీపంలో సభ జరిగే ప్రాంగణాన్ని 28 ఎకరాల్లో అధికారులు సిద్ధం చేస్తున్నారు. స్టేజి వెనుక 10 ఎకరాలు, సమీపంలో 32 ఎకరాలలో VIPల వాహనాల పార్కింగ్‌కు స్థలం చదును చేసి సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు తరలి వచ్చే బస్సులకు 110 ఎకరాలలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

Similar News

News April 24, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 24, 2025

KMR: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నోడల్ అధికారి

image

ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు నోడల్ ఆఫీసర్ జి.ఫనింద్రరెడ్డి కామారెడ్డి జిల్లాలో పర్యటించి PACS, ఐకేపీ సెంటర్లను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. వసతులపై ఆరా తీశారు. తక్షణ ట్యాబు ఎంట్రీ, 72 గంటల్లో చెల్లింపు, తేమ శాతం, FAQ నిబంధనల ప్రకారం కొనుగోలు జరగాలని అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News April 24, 2025

అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది: MLC కవిత

image

గోదావరిఖనిలో రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవ వేడుకలు బుధవారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా MLC కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ‘శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణ వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ శుభం కలగాలని’ ఆమె ఆకాంక్షించారు.

error: Content is protected !!