News April 23, 2025
స్కూళ్లకు సెలవులు షురూ

ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఉపశమనం లభించనుంది. తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ చివరి వర్కింగ్ డే ముగిసింది. రేపటి నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. 12న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. ప్రస్తుతం ఎండలు ముదిరినందున పిల్లలు మధ్యాహ్నం వేళల్లో బయటికెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే ఈత కోసం చెరువులు, కాల్వల వద్దకు వెళ్లినప్పుడు జాగ్రత్త వహించాలి.
Similar News
News April 19, 2026
పవన్ త్వరలోనే కోలుకుంటారు: ప్రధాని మోదీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ ధైర్యవంతుడు. ఆయన త్వరలోనే కోలుకుంటారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. సైనసైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్‌కు నిన్న <<19687368>>సర్జరీ<<>> జరిగిన సంగతి తెలిసిందే.
News April 19, 2026
అనిల్ రావిపూడి సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్టర్?

టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమా కోసం తొలిసారి తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఆయన తెరకెక్కించబోయే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్ కుమార్‌ను ఖరారు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. అనిల్ డైరెక్ట్ చేసిన గత రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించారు. అవి సూపర్ హిట్టయినా మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చడం ఆసక్తికరంగా మారింది.
News April 19, 2026
ఆ జట్ల మధ్యే 13 IPL ట్రోఫీలు.. కానీ!

ముంబై, చెన్నై, కోల్‌కతా జట్ల ప్రదర్శన వాటి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఈ మూడు జట్లే ఏకంగా 13 IPL ట్రోఫీలు(MI-5, CSK-5, KKR-3) గెలవగా ప్రస్తుత సీజన్‌లో తేలిపోయాయి. 6 మ్యాచుల్లో 2 విజయాలతో చెన్నై PTలో 7వ స్థానంలో ఉంది. ఇక 5 మ్యాచుల్లో 1 గెలుపుతో MI 9, 6 మ్యాచుల్లో 5 ఓటమి, ఒక డ్రాతో KKR చివరి స్థానాల్లో ఉన్నాయి. 3 జట్లలోనూ కెప్టెన్లు రాణించకపోవడం మైనస్. ఇకనైనా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


