News March 28, 2024
తలైవా171.. మాస్ లుక్‌లో రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘తలైవా171’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. చేతి వాచ్‌లను చైన్‌లా పట్టుకుని ఉన్న రజనీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.
Similar News
News February 13, 2026
మున్సిపల్ ఫలితాలు.. పలుచోట్ల హంగ్

TG: మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల హంగ్ ఏర్పడింది. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 చోట గెలిచారు. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 చోట్ల గెలిచారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 16 స్థానాలు ఉండగా కాంగ్రెస్, BRS చెరో 8 చోట్ల గెలిచాయి.
News February 13, 2026
మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం

TG: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో సంచలనం నమోదైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS కాకుండా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) విజయం సాధించింది. మొత్తం 10 స్థానాల్లో AIFB 8 చోట్ల, కాంగ్రెస్, BRS ఒక్కో స్థానంలో గెలిచాయి. ఆ ప్రాంతంలో మంచి పేరున్న వడ్డేపల్లి శ్రీనన్న కొద్ది రోజుల క్రితం కల్వకుంట్ల కవితకు చెందిన జాగృతిలో చేరారు. ఆయన మద్దతుదారులు AIFB గుర్తు (సింహం)పై పోటీ చేసి గెలిచారు.
News February 13, 2026
పురుషుల్లో తగ్గుతున్న Y క్రోమోజోమ్.. జీవితకాలం తగ్గే ప్రమాదం!

పురుషుల్లో ఉండే Y క్రోమోజోమ్ మగాళ్లు పుట్టడానికి కీలకం. వయసు పెరిగే కొద్దీ వారి కణాల నుంచి ఈ క్రోమోజోమ్‌ను కోల్పోతారని, దీనివల్ల నష్టం లేదని గతంలో సైంటిస్టులు భావించేవారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం Y క్రోమోజోమ్ తగ్గడం వల్ల పురుషులు తీవ్రమైన వ్యాధుల బారిన పడి జీవితకాలం తగ్గుతుందట. అయితే వారసుల్లో ఈ లోపం ఉండదని, మగాళ్ల పుట్టుకపై ఇప్పటికిప్పుడు ప్రభావం ఉండదని తేలింది. ఇది ఊరటనిచ్చే అంశం.


