News April 23, 2025

అన్నమయ్య జిల్లాలో పదో తరగతి విద్యార్థి సూసైడ్

image

పదో తరగతి ఫెయిల్ కావడంతో అన్నమయ్య జిల్లాలో ఓ విద్యార్థి బలవనర్మణానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడుకు చెందిన విద్యార్థి ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు. నేడు ఫలితాలు రాగా.. మ్యాథ్స్, సైన్స్‌లో ఫెయిలయ్యాడు. మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Similar News

News April 24, 2025

ఏ సబ్జెక్టులో ఎంతమంది ఫెయిల్ అయ్యారంటే!

image

కర్నూలు జిల్లాలో 31,185 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 9,601 మంది ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. తెలుగులో 2,598 మంది, హిందీలో 292, ఇంగ్లీష్‌లో 4,660, మ్యాథ్స్ 7,781, సైన్స్ 6,900,  సోషల్‌లో 4,497 మంది ఫెయిల్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇక తెలుగులో 91 మంది, హిందీలో 15, ఇంగ్లీష్‌లో 1, మ్యాథ్స్ 22, సైన్స్‌ 21, సోషల్‌లో 15 మంది 100/100 మార్కులు సాధించారని వివరించారు.

News April 24, 2025

నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

image

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.

News April 24, 2025

UPSC సివిల్స్ పరీక్షలలో సత్తా చాటిన CRDA అధికారి

image

ఏపీ సీఆర్‌డీఏ ఎకనామిక్ డెవలప్మెంట్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న బడబాగ్ని వినీష UPSC సివిల్స్-2024 పరీక్షలలో 467వ ర్యాంక్ సాధించారు. ఓ పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ కఠినమైన సివిల్స్ పరీక్షలో ర్యాంక్ సాధించిన వినీషను పలువురు అభినందించారు. IAS/IFS క్యాడర్ అధికారిగా ప్రజలకు మరింతగా సేవలందిస్తానని వినీష ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

error: Content is protected !!